Zainab Ravdjee : మొదటిసారి భార్యతో సినిమా ఈవెంట్లో అఖిల్.. అయ్యగారే నెంబర్ వన్ అంటూ జైనబ్ రవ్జీ..

నేడు జరిగిన సక్సెస్ ఈవెంట్ కి అఖిల్ తో పాటు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా హాజరయ్యారు. (Zainab Ravdjee)

  • Published on- July 15, 2026 / 09:30 PM IST

Zainab Ravdjee

Zainab Ravdjee : అక్కినేని అఖిల్ ఇటీవల లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లెనిన్ సినిమా 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అఖిల్ మొదటిసారి కమర్షియల్ హిట్ కొట్టడంతో అక్కినేని ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని గుంటూరులో నిర్వహించారు.

నేడు జరిగిన సక్సెస్ ఈవెంట్ కి అఖిల్ తో పాటు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా హాజరయ్యారు. 2025 జూన్ లో అఖిల్ జైనబ్ రవ్జీ వివాహం జరిగింది. అప్పట్నుంచి ఈ జంట ఎయిర్ పోర్ట్ విజువల్స్ లో తప్ప ఒక్కసారి కూడా బయట కనపడలేదు. మీడియా ముందుకు అసలే రాలేదు. నేడు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా లెనిన్ సక్సెస్ ఈవెంట్ కి రావడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Also Read : This Week Movies : వామ్మో.. ఈ వారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్.. ఒకే హీరోయిన్ వి రెండు.. ఒక్కటైనా హిట్ అవుద్దా..?

ఈవెంట్లో భాగంగా యాంకర్ జైనబ్ రవ్జీని మాట్లాడించగా.. చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వంగా ఉంది. మూవీ టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్. అయ్యగారే నెంబర్ వన్ అని క్యూట్ గా చెప్పారు. ఇక అఖిల్ కూడా.. తను ఈ జర్నీ అంతా తోడు ఉంది అని తెలిపాడు. దీంతో అఖిల్ – జైనబ్ రవ్జీ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ క్యూట్ వీడియో చూసేయండి..