Drama Juniors 7 grand Finale : ఆదివారం హంగామా.. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1.. భోళా శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్!
Drama Juniors 7 grand Finale : జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేపార్ట్ 1ను రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది.
- Sreehari A
- Published On : September 12, 2024 / 10:57 PM IST
Bholaa Shankar WTP & Drama Juniors 7 grand finale. Photo
Drama Juniors 7 grand Finale : తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్‌స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం (సెప్టెంబర్ 15) మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు రెడీ అయింది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ను వరల్డ్ ప్రీమియర్‌గా జీ తెలుగు అందించనుంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేసే సక్సెస్ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఫైనల్ వరకు చేరుకుంది. స్కిట్స్, పిల్లల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది.
Read Also : Balakrishna : విజయవాడలో బాలకృష్ణతో యువ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధు జొన్నలగడ్డ
ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెప్టెంబర్ 15న మొదటి భాగం, సెప్టెంబర్ 22న రాత్రి 9 గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ నటించిన భోళా శంకర్ సెప్టెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం2:30 గంటలకు ప్రసారం కానుంది. ఆ తర్వాత డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఆదివారం హంగామాలో మెగాస్టార్ మెగా మూవీ భోళా శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రారంభం కానుంది.
ఈ సినిమా కథ శంకర్(చిరంజీవి) అనే టాక్సీ డ్రైవర్. అతని చెల్లెలు మహాలక్ష్మి(కీర్తి సురేష్) పాత్రలే ప్రధానంగా సాగుతుంది. చెల్లెలు చదువు కోసం శంకర్ కోల్‌కతాకు చేరుకుంటాడు. అలెక్స్ (తరుణ్ అరోరా) నేతృత్వంలోని మాఫియా ముఠా నగరంలోని అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది. శంకర్ ఆ కిడ్నాప్‌లను పరిష్కరించడంలో సహాయం చేస్తాడు. దాంతో అలెక్స్ శంకర్‌పై పగ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శంకర్ ను అలెక్స్ చంపాడా? అసలు ఎవరీ శంకర్? అతని గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జీ తెలుగులో ఆదివారం ప్రసారమయ్యే భోళా శంకర్ సినిమా చూసేయండి.
జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేపార్ట్ 1ను రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. శ్రీరామ్ వెంకట్ యాంకర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ప్రీతి శర్మ,సౌందర్య మెంటర్లుగా వ్యవహరించారు. ఇక, ఈ సీజన్‌కి సినీ ప్రముఖులు పూర్ణ, బలగం వేణు, జయప్రద న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు. ఈ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఎపిసోడ్ కూడా యాంకర్, జడ్జీలు, కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైనస్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది.
అంతేకాదు.. ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా లవర్ బాయ్ తరుణ్ హాజరై విజేతలను ప్రకటించనున్నారు. మొదటిసారి బుల్లితెరపై తరుణ్ ఎంట్రీతో ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా ప్రేక్షకులను అలరించనుంది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా తరుణ్, విక్టరీ వెంకటేశ్‌లపై స్పెషల్ స్కిట్స్, కూతురు లక్ష్యాన్ని చేరుకోవడంలో తల్లిదండ్రులు పడే కష్టాలపై చేసే స్కిట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. అన్ని భావోద్వేగాల మధ్య గణేష్ పండుగ గురించి ఫన్నీ స్కిట్స్, టైమ్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ఎపిసోడ్స్ తప్పకుండా చూడాల్సిందే.
అంతేకాదు. మీ అభిమాన సీరియల్స్ మేఘసందేశం, పడమటి సంధ్యరాగం ప్రత్యేక ఎపిసోడ్ మహాసంగమం సెప్టెంబర్ 14, 15తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. రెండు సీరియల్స్‌కు చెందిన నటీనటులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోనున్నారు. జీ తెలుగు అందిస్తున్న ఈ వారాంతం వినోదాన్ని మీరు మిస్ కాకుండా చూసేయండి.
Read Also : Rakul Preet Singh : ప్రభాస్‌తో రెండు సినిమాల్లో ఛాన్స్.. చెప్పకుండానే తొలగించారు : రకుల్ ప్రీత్ కామెంట్స్!
