Rakul Preet Singh : ప్రభాస్‌తో రెండు సినిమాల్లో ఛాన్స్.. చెప్పకుండానే తొలగించారు : రకుల్ ప్రీత్ కామెంట్స్!

Rakul Preet Singh : రకుల్ టాలీవుడ్‌లో సినిమా అవకాశాలకు సంబంధించి ఇంట్రిస్టింగ్ కామెంట్స్ చేసింది.

Rakul Preet Singh : ప్రభాస్‌తో రెండు సినిమాల్లో ఛాన్స్.. చెప్పకుండానే తొలగించారు : రకుల్ ప్రీత్ కామెంట్స్!

Rakul Preet Singh on being replaced in Prabhas's film ( Image Source : Google )

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అప్పట్లో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. తెలుగు స్టార్ హీరోల సరసన నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొండపొలం మూవీలో చివరిగా నటించింది.

ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది రకుల్.. అప్పటినుంచి బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా రకుల్ టాలీవుడ్‌లో సినిమా అవకాశాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాడియాతో ఇంటర్వ్యూలో రకుల్ ముచ్చటిస్తూ.. తనకు మొదట్లో తెలుగులో చేజారిన సినిమాలకు సంబంధించి అనేక విషయాలను రివీల్ చేసింది.

4 రోజుల షూటింగ్ తర్వాత తొలగించారు :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం అప్పట్లో వచ్చినట్టే వచ్చి చేజారిందట.. మొదట్లో ప్రభాస్ రెండు సినిమాల్లో తానే హీరోయిన్ అని చెప్పారని, కానీ, అనుకోకుండా తనను ఆయా సినిమాల నుంచి తప్పించారని రకుల్ వాపోయింది. కనీసం తనను తొలగించారనే విషయాన్ని కూడా చెప్పలేదని తెలిపింది. ‘‘ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను.. కానీ, నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరిని తన స్థానంలో తీసుకున్నారు’’ రకుల్ వెల్లడించింది.

అప్పటికీ ఇంకా టాలీవుడ్‌లోకి రకుల్ ఎంట్రీ ఇవ్వలేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయం. రాకరాక ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చింది. ఒకవేళ నటిస్తే అది ప్రభాస్‌తో చేసిన తెలుగు చిత్రం అవుతుంది. కానీ కొన్నిసార్లు, పరిశ్రమ గురించి పెద్దగా తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురువుతుందని తనకు ఎదురైన అనుభవాన్ని రకుల్ వెలిబుచ్చింది. “అది నా అమాయకత్వం కావొచ్చు. నేను చాలా అమాయకంగా ఉన్నాను, ఓహ్, సరే, నన్ను సినిమా నుంచి తొలగించారా? పర్వాలేదు, బహుశా ఇది నాకోసం కాదు. ఇది కాకపోతే మరొకటి అనుకున్నా” అని రకుల్ తెలిపింది.

కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు :
“నాకు కూడా సమాచారం ఇవ్వలేదు. నేను నా షెడ్యూల్‌ను ముగించిన తర్వాత ఢిల్లీకి వెళ్లాను. ఆ విషయం తరువాత తెలుసుకున్నాను. అలాంటిదే మరో తెలుగు సినిమా ప్రాజెక్ట్‌లో మళ్లీ జరిగింది. కానీ, నేను దానిపై సంతకం చేశాను. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. రెండు పెద్ద చిత్రాలతో ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడు అవగాహన కూడా పెరుగుతుంది. అక్కడ ఆటిట్యూడ్ సమస్య ఉందా లేదా నటన తెలియదనే తొలగించారా? అనేది అందరూ అనుకుంటారు.

ఏదైనా ఇండస్ట్రీ గురించి తెలియనప్పుడు అలాంటివి జరిగినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించానని రకూల్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ మూవీ గిల్లితో తొలిసారిగా నటించింది. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి రకుల్ థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక మూవీలో నటించింది. ఇండియన్ 2 మూవీలో కూడా మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2 మూవీలో నటిస్తోంది.

Read Also : Balakrishna : విజ‌య‌వాడ‌లో బాల‌కృష్ణ‌తో యువ హీరోలు విశ్వ‌క్‌సేన్‌, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌