Zineeverse Started due to Helping for Producers in Story and Scripts
Zineeverse : ఇటీవల చాలా మంది కొత్త నిర్మాతలు సినీ పరిశ్రమకు వచ్చి సరైన అవగాహన లేక సరైన కథలతో రాక నష్టపోతున్నారు. ఇలాంటి నిర్మాతలకు వారికి సపోర్ట్ చేసేందుకు తాజాగా జినీవర్స్ అనే సంస్థని స్థాపించారు. కొత్త నిర్మాతలతో పాటు సీనియర్స్ కి కూడా కథలు, స్క్రిప్ట్స్ విషయంలో ఉపయోగపడేలా జినీవర్స్ సిద్దమవుతుంది.
సినీ పరిశ్రమలో రైటింగ్, డైరెక్షన్, నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్.. ఇలా అనేక రంగాల్లో అనుభవం ఉన్నవారితో ఒక టీమ్ ని ఏర్పాటు చేసింది జినీవర్స్. బౌండెడ్ స్క్రిప్ట్ నుంచి ఒక డెమో ఫిల్మ్ వరకు తయారుచేసి నిర్మాతలకు అందించేలా ఓ కొత్త ప్రణాళికని రూపొందించింది జినీవర్స్.
నిర్మాతలకు ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఎలా నిర్మించాలి అనే అన్ని విషయాల్లో జినీవర్స్ సపోర్ట్ చేయనుంది. సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న N బల్వంత్ సింగ్ ఈ జినీవర్స్ సంస్థని నడిపిస్తున్నారు. +91-8297063000 ఈ నంబర్ తో జినీవర్స్ ని సంప్రదించి సినిమా నిర్మాణం, స్క్రిప్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.