Kacheguda-Yesvantpur Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ఎక్స్‭ప్రెస్ రైలు గురించి 10 ఆసక్తికర విషయాలు

మరో 9 కొత్త వందే భారత్ రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సారి అధిక ప్రాధాన్యం లభించింది

Kacheguda-Yesvantpur Vande Bharat: ఆదివారం వర్చువల్ గా దేశవ్యాప్తంగా 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ తొమ్మిదిలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్-బెంగళూరు, విజయవా-చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో తిరుగుతున్న ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

దీంతో రానున్న రోజుల్లో మరిన్ని స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీసులను విస్తరించాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందులో భాగం ఇవాళ మరో 9 కొత్త వందే భారత్ రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సారి అధిక ప్రాధాన్యం లభించింది. కాచిగూడ వేదికగా జరిగిన ప్రారంభవోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Malook Nagar Slams Rahul Gandhi: రాజస్థాన్‭ లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా..? డానిష్ అలీని రాహుల్ గాంధీ కలవడంపై విరుచుకుపడ్డ బీఎస్పీ నేత

హైదరాబాద్–బెంగళూరు మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మహబూగ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపుర్ చేరుకుంటుంది. తిరిగి 2.40గంటలకు యశ్వంతపూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. బుధవారం మినహా ఇది ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

కాగా, హైదరాబాద్–బెంగళూరు వందేభారత్ రైలు గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
1. ఈ రైలు వందేభారత్ సిరీస్ లో 27వది. అలాగే 15వ మినీ వందేభారత్ రైలు. ఇది రెండవ జనరేషన్ రైలు.
2. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఇది మూడవ వందేభారత్ రైలు.
3. ఈ రైలుతో బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం రెండు గంటలకు పైగా తగ్గనుంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఉన్న 612 కిలీమీటర్ల దూరాన్ని ఈ రైలు 7 గంటల్లో చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది.
4. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రోజు వారీగా ప్రయాణం కొనసాగుతుంది. అలాగే వారంలో ఆరు రోజులు ప్రయాణిస్తుంది.
5. హైదరాబాద్-బెంగళూరు మధ్య తెలంగాణ ఒక స్టాపు (మహబూబ్ నగర్), ఆంధ్రప్రదేశ్ లో మూడు స్టాపులు (కర్నూలు, అనంతపురం, ధర్మవరం) ఉన్నాయి. అయితే కర్ణాటకలో ఒక్క స్టాపు కూడా లేకపోవడం గమనార్హం.
6. ఈ రైలు సగటున 70-90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
7. కాచిగూలో ఉదయం 05:30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 2:00 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:45 గంటలకు బయల్దేరి రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
8. కాచిగూడ నుంచి ప్రారంభమైన మొదటి వందే భారత్ రైలు ఇదే.
9. ఈ రైలులో 8 కోచులు ఉంటాయి. దీనిని చెన్నైలోని బెరంబూరు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు.
10. ఈ రైలు నిర్వహణను దక్షిణ మధ్య రైల్వే చూసుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు