కరోనా రోగుల ఆందోళన..సెంటర్ లు ఇష్టం లేకపోతే..Home Quarantine కు వెళ్లవచ్చు – మంత్రి బిశ్వా శర్మ

Covid – 19 సెంటర్ లో సదుపాయాలు సరిగ్గా లేకుంటే…హోం క్వారంటైన్ ఎంచుకోవాలని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. ఇక్కడ సంతోషంగా లేకుంటే..ఒప్పందంపై సంతకం చేసి Home Quarantineలోకి వెళ్లవచ్చన్నారు.
సరియైన భోజనం అందించడం లేదు..కనీసం మంచినీరైనా ఇవ్వడం లేదు…అంటూ కరోనా రోగులు విరుచుకపడుతున్నారు. అస్సాం రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలోని ఓ కోవిడ్ సెంటర్ నుంచి 100 మంది కరోనా పాజిటివ్ రోగులు జాతీయ రహదారి 31ని దిగ్భందించారు. దీనిపై మంత్రి శర్మ స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ…
కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఇక్కడకు తీసుకరావడం జరుగుతోందని, ఇక్కడ చికిత్స అనంతరం వ్యాధి తగ్గుతుందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు నిరంతరం విధుల్లో ఉంటుండడం..ఒత్తిడికి గురి కావడంతో కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చన్నారు.
ఇతర రాష్ట్రాల్లో పరీక్షల కోసం డబ్బులు చెల్లించే పరిస్థితి నెలకొందని, కానీ అస్సాం రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్, వారి బస, ఆహారం వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు.
తమకు కేంద్రంలో సరియైన ఆహారం, నీరు అందివ్వడం లేదని, 10 నుంచి 12 మందిని ఒకే గదిలో ఉంచుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సుమారు 100 మంది రోగులు జాతియ రహదారి 31ని దిగ్భందించారు.
దీనిపై కమ్రూప్ డిప్యూటీ కమిషనర్ కైలాశ్ కార్తీక్ స్పందించారు. వారు చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కరోనా రోగులు ఇలా చేయడం సరికాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.
కరోనా రోగులు ఆందోళన చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పష్టమైన హామీనిచ్చిన తర్వాత..కేంద్రానికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు.