4వ తరగతి పరీక్ష రాసిన 105 ఏళ్ల బామ్మ 

  • Publish Date - November 20, 2019 / 11:14 AM IST

కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్సి వచ్చింది. కానీ చదువుకోవాలనే ఆమె కోరిక మాత్రం తీరలేదు. కానీ మనస్సుంటే మార్గం ఉండకపోదు అన్నట్లుగా తన 105 సంవత్సరాల వయస్సులో నాలుగవ తరగతి పరీక్ష రాసారు భగీరథి అమ్మ. అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ క్రింద ఈ పరీక్షను రాసారు భగీరథీ అమ్మ. 

నాలుగో తరగతి పరీక్షతో తన చదువును తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారు భగీరథి. మూడవ తరగతి చదువుతుండగా..తల్లి కన్నుమూసింది. దీంతో తన చిన్న తోబుట్టువులను చూసుకోవాల్సి ఉండటంతో ఆమె చదువుకు స్వస్తి చెప్పారు. 

తరువాత పెళ్లి..వివాహం అయిన వెంటనే ఆమె ముప్పైలు వచ్చేసరికే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయేనాటికి ఆమెకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి బాద్యతలు ఇలా వయస్సు మీద పడింది. అయినా భగీరథి అమ్మ చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నారు.  చక్కటి కంటిచూపు..వినికిడి శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఒక్కసారి ఏ విషయం అయినా విన్నారు అంటే చక్కగా బుర్రలో ప్రింట్ అయిపోయినట్లే అంతటి జ్నాపకశక్తి ఆమెది.

 
ఇది ఆమె పాఠాలు విన్నప్పుడు చక్కగా ఉపయోగపడింది.కేరళ రాష్ట్రం అక్షరాస్యత మిషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘అక్షరలక్ష్యం’ ప్రాజెక్ట్‌లో భాగంగా  భగీరథి అమ్మ ఈ పరీక్షను రాశారు. భగీరథీ అమ్మ చిన్న కుమార్తె థాంకమణికి ఇప్పుడు 67 ఏళ్ల వయసు. 2018లో అక్షరాస్యత మిషన్ అక్షర లక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో 100 కి 98 మార్కులు సాధించిన  96 ఏళ్ల కార్తియని అమ్మ భగీరథి అమ్మ గట్టి పోటీదారు అని నిరూపిస్తోంది.