ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఢిల్లీలో 144 సెక్షన్

కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.

  • Publish Date - March 19, 2020 / 07:17 AM IST

కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.

కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం(మార్చి 19,2020) ఆదేశాలు ఇచ్చారు. వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని సీపీ కోరారు. ర్యాలీ, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో పాల్గొనొద్దని ఆర్డర్ ఇచ్చారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ వార్నింగ్ ఇచ్చారు. మార్చి 31వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇవన్నీ తీసుకుంటున్నామని, ప్రజలు భయపడాల్సిన పని లేదని సీపీ స్పష్టం చేశారు.

కరోనా వైరస్ అంటు వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. కరోనా వైరస్ ను నియంత్రించడమే ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే నాగ్ పూర్, ముంబైలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు గుమిగూడకుండా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఢిల్లీకి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి తీసుకొస్తున్న వారిని ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు సూచించారు. షహీన్ బాగ్ లో మాత్రం సీఏఏ వ్యతిరేక నిరసన, ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళనలు విరమింపజేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.

See Also | ఏపీలో రెండుకి చేరిన కరోనా కేసులు, ఒంగోలు యువకుడికి కొవిడ్ వైరస్, గుంటూరులోనూ కలకలం