IAF ఫైటర్ల కోసం డీఆర్డీఓ సూపర్ సోనిక్ మిస్సైల్ రెడీ

భారత తొలి ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిద్ధమైంది. యుద్ధంలో వాడేందుకు డీఆర్డీఓ ఆయుధాన్ని సిద్ధం చేసింది. 15ఏళ్ల పాటు శ్రమించి ప్రయోగాన్ని సక్సెస్ చేయడంతో IAF నుంచి దాదాపు 200మిస్సైళ్ల వరకూ ఆర్డర్ వస్తుందని భావిస్తోంది డీఆర్డీఓ. గతంలో 110కిలోమీటర్లు ఉండే స్ట్రైక్ రేంజ్‌ను 160కిలో మీటర్ల వరకూ పెంచే శక్తి ఈ మిస్సైళ్లకు ఉంది. 

ఈ మిస్సైల్ ప్రయోగంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌లతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ తయారుచేసిన జాబితాలో భారత్ చేరిపోయింది. భారత్ ఐఏఎఫ్ బలగాలు పాకిస్తాన్‌ జైషే మొహమ్మద్ క్యాంపుపై దాడి చేసిన సమయంలో వీటిని ఉపయోగించాలని ఐఏఎఫ్ భావించింది. 

రష్యాలో తయారైన సుఖోయ్, తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ లు అన్ని వాతావరణాలు తట్టుకుని పోరాడగలిగేలా తయారుచేశారు. ప్రస్తుత మిస్సైల్ ఒకేసారి అనేక టార్గెట్ లను ఎయిమ్ చేసుకోగలదు. 80నుంచి 86కిలోమీటర్ల దూరాన్ని పిన్ పాయింట్ కచ్చితత్వంతో టార్గెట్ చేయగలవు. ఈ టెక్నాలజీ సాయంతో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్, భూ తలం నుంచి ప్రయోగించగల మిస్సైల్స్ తయారుచేయవచ్చు.