1,500 Cong workers joined BJP when Rahul was in Maharashtra: BJP leader
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఈ యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నేత చంద్రశేఖర్ బవాన్‌కులే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో యాత్ర చేస్తున్న సమయంలోనే ఆ రాష్ట్రానికి చెందిన 1,500 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman: నేను మధ్యతరగతే, వారి కష్టాలు తెలుసు.. బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా
‘‘కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు. అందుకే ఆ మూడు పార్టీలు (కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన) ముందు తమ సొంతింటిని కాపాడువాలి. తర్వాత దేశవ్యాప్త యాత్రలు చేయాలి” అని చంద్రశేఖర్ బవాన్‌కులే అన్నారు.