బాలికపై గ్యాంగ్ రేప్.. 10మంది అరెస్టు

త్రిపురలో మరో సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కొవై జిల్లాలో బాలికను ఐదుగురు రేప్ చేశారు. ఘటనలో పరోక్షంగా కారకులైన వారితో కలిపి మొత్తం పది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రేప్ జరగడానికి చోటు ఇవ్వడంతో పాటు ఈ ఘటన జరిగేందుకు సహకరించడంతో వారందరినీ పోలీసులు అదుపులో తీసుకున్నారు.



హిందీ డైలీ దైనిక్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. ఘటన జులై 21న త్రిపురలోని ఖాసియామంగళ్ లో జరిగింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ), ఇద్దరు అసోసియేట్లతో కలిసి పలు ప్రాంతాల్లో వారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఇద్దరు ఇంకా కనిపించడం లేదని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.



ఇది జరుగుతుండా స్టూడెంట్లు ఈ ఘటనపై నిరసనలు తెలుపుతున్నారు. త్రిపుర యూనివర్సిటీ స్టూడెంట్ అస్మీరా దేవ్ వర్మ తన గ్రూపును తీసుకుని స్టాండ్ అగైనెస్ట్ రేప్ అంటూ నినాదాలు చేస్తూ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగింది.