Nisarga Adhikary: ఈ కుర్రోడు మామూలోడు కాదు.. 19 ఏళ్లకే సీబీఎస్‌ఈ లోపాలను బయటపెట్టాడు.. ఏకంగా ఐఐటీ కాన్పూర్‌లో జాబ్ కొట్టాడు
ఆసక్తి, కష్టపడి నేర్చుకోవాలనే తపన ఉంటే చిన్న వయసులోనే గొప్ప అవకాశాలను అందుకోవచ్చని 19 ఏళ్ల నిసర్గ అధికారి(Nisarga Adhikary) ప్రయాణం చెబుతోంది.
- V Santhosh Kumar
- Published on- June 11, 2026 / 03:19 PM IST
19 year old nisarg adhikari gets iit kanpur job after exposing cbse osm flaws
- సీబీఎస్‌ఈ లోపాలు గుర్తించిన విద్యార్థి
- 19 ఏళ్లకే ఐఐటీలో ఉద్యోగం
- సైబర్ సెక్యూరిటీలో అరుదైన అవకాశం
Nisarga Adhikary: నేటి డిజిటల్ యుగంలో ప్రతిభకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు 19 ఏళ్ల నిసర్గ అధికారి. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, కష్టపడి నేర్చుకోవాలనే తపన ఉంటే చిన్న వయసులోనే గొప్ప అవకాశాలను అందుకోవచ్చని అతడి ప్రయాణం చెబుతోంది. ఇటీవల సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థలోని లోపాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిసర్గ, ఇప్పుడు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
సైబర్ సెక్యూరిటీ రంగంలో అరుదైన అవకాశం:
ఐఐటీ కాన్పూర్ కు చెందిన సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ C3iHubలో నిసర్గ అధికారిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియమించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ మహీంద్రా అగర్వాల్ మాట్లాడుతూ, నిసర్గ(Nisarga Adhikary) అసాధారణ సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువకుడని ప్రశంసించారు. అతడి చేరికతో సైబర్ భద్రతా పరిశోధనలకు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే సాంకేతిక ప్రయాణం:
ఈ ఏడాదే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నిసర్గ, ఆరేళ్ల వయసు నుంచే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆరో తరగతి నుంచి సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని ‘క్యాప్చర్ ది ఫ్లాగ్’ వంటి హ్యాకింగ్ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నాడు. ఇటీవల సీబీఎస్‌ఈ OSM పోర్టల్‌లోని లోపాలను గుర్తించి వాటిని CERT-In దృష్టికి తీసుకెళ్లడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఫుల్‌టైమ్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగం దక్కడం తనకు సంతోషంగా ఉందని, అయితే వేతనం ఆశించినంతగా లేదని నిసర్గ పేర్కొన్నాడు.
