Beggar 2000 Rupees Notes : అతనో బిచ్చగాడు.. కానీ జేబు నిండా రూ.2 వేల నోట్ల కట్టలే..
ఉత్తర ప్రదేశ్ లో రోడ్లపై బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడి దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతని జేబుల్లో అన్నీ 2000 రూపాయల నోట్లే కనిపించాయి.
- bheemraj
- Published On : December 18, 2022 / 02:56 PM IST
beggar 2000 rupees notes
Beggar 2000 Rupees Notes : ఉత్తర ప్రదేశ్ లో రోడ్లపై బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడి దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతని జేబుల్లో అన్నీ 2000 రూపాయల నోట్లే కనిపించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరీఫ్ అనే 50 ఏళ్ల వ్యక్తి గోరఖ్ పూర్ వీధుల్లో బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆయనకు చెవులు వినబడవు.
ఈ నేపథ్యంలో రోజులాగే శనివారం వీధుల్లో తిరుగుతూ బిక్షమెత్తుకుంటుండగా ఆయనను బైక్ ఢీకొట్టింది. దీంతో ఆయన కాలు విరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. అతని దగ్గర గుర్తింపు కార్డులేమైనా ఉన్నాయా అని జేబుల్లో వెతికారు. అయితే వారికి ఐడీ కార్డులకు బదులు రూ.2 వేల నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులతోపాటు అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.
బిచ్చమెత్తుకుంటున్న ఇంజనీర్..షాక్ తిన్న పోలీసులు
అన్నింటినీ లెక్కించగా రూ.3లక్షల 64 వేలు ఉన్నాయి. మొత్తం రూ.2 వేల నోట్లేనని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆయనను బీఆర్ డీ మెడికల్ కాలేజీకి తరలించామని చెప్పారు. అయితే అతని కాలు విరిగిపోయిందని తెలిపారు. ఆ డబ్బంతా తమ దగ్గరే ఉందని పోలీసులు పేర్కొన్నారు.
