బిచ్చమెత్తుకుంటున్న ఇంజనీర్..షాక్ తిన్న పోలీసులు

  • Published By: madhu ,Published On : January 19, 2020 / 01:14 AM IST
బిచ్చమెత్తుకుంటున్న ఇంజనీర్..షాక్ తిన్న పోలీసులు

ఇదేదో సినిమా అనుకోకుండి. అవును మీరు వింటున్నది నిజమే. ఓ ఇంజనీర్ బిక్షమెత్తుకుంటున్నాడు. రిక్షా కార్మికుడితో ఘర్షణ పెట్టుకున్న అనంతరం పీఎస్‌లో ఆ వ్యక్తి రాసిన లేఖ చూసిన పోలీసులు షాక్ తిన్నారు. స్పష్టమైన ఇంగ్లీషు భాషలో రాసి ఉంది. దీంతో అతను గురించి వివరాలు సేకరించగా…గతాన్ని కళ్లెదుట ఆవిష్కరించాడు. ఈ ఘటన ఓడిశాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…
పూరీ జగన్నాథాలయం వద్ద బిక్షగాడు, రిక్షా కార్మికుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త పోలీసు స్టేషన్‌కు చేరింది. గొడవలో ఇద్దరు గాయపడ్డారు. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తిని లిఖితపూర్వకంగా లేఖ రాయాలని పోలీసులు సూచించారు. అనంతరం లేఖ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు.

చక్కటి ఇంగ్లీషులో రాసి ఉన్న లేఖను చూసి ఎదురుగా ఉన్న యాచకుడిని పైకి..కిందకు చూశారు. అనంతరం నీవు ఎవరు ? ఎక్కడుంటావు ? నీ ఇళ్లు ఎక్కడ ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు మిల్టన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసిన భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. శంకర్ తండ్రి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసుగా పనిచేశారు. అన్నదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు ఉన్నతస్థానంలో ఉన్నారు. కొనేళ్ల క్రితం ఆయన చనిపోయారు. అమ్మ కూడా చనిపోయింది.

BSc అనంతరం 1995లో CIPETలో డిప్లామా ఇన్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌ చేశానంటూ..తదితర వివరాలన్నింటినీ గిరిజా శంకర్ వెల్లడించారు. మానసిక ఇబ్బందుల వల్లే..ఇల్లూ…ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆకలిని తీర్చుకోవడానికి యాత్రా స్థలాల్లో బిక్షమెత్తుకుంటున్నట్లు వెల్లడించారు. గిరిజా శంకర్ కుటుంబసభ్యుల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ అతను మాత్రం కుటుంబసభ్యులను కలుసుకోవాలని లేదని వెల్లడించాడు. 

Read More : షిర్డీ బంద్ : సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది