2020-2021 Budget : ఆర్థికాభివృద్ధి సాధిస్తూ..ఆకాంక్షలు నెరవేరుస్తూ..భద్రతనిచ్చే భారత్

  • Publish Date - February 1, 2020 / 05:35 AM IST

2020-2021 బడ్జెట్ ను లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్..సబ్ కా విశ్వాస్ నినాదంతో పాలన చేస్తున్నామని తెలిపారు. మూడు విధానాల ద్వారా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. ఏస్పీరేషనల్ ఇండియా, ఎకనామిక్ డెవలప్ మెంట్ అండ్ కేరింగ్ సొసైటీ (ఆకాంక్ష భారతదేశం, ఆర్థికాభివృద్ది సాధించిన భారత్,  భద్రతనిచ్చే భారత్) కోసం నిరంతరం కృషి చేస్తున్నామనీ..దీని కోసం మా ప్రభుత్వం పాలనలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నిర్మలా తెలిపారు. దీని కోసం పాలకులంతా నిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. 

ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని..పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య 7 శాతం ఆర్థికాభివృద్ధి సాధించి డెవలప్ భారత్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  

దేశ ప్రజలందిరికి మెరుగైన జీవితం అందించటం
అందరికి ఆర్థిక స్వావలంభన అందించటం
అందరికీ సంక్షేమం అందించటం
ఆశాజన భారతం, ఆర్థిక స్వావలంబన అందరికీ సంక్షేమం అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా 2020-21బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. కాగా..మంత్రి నిర్మలా సీతారామన్ రెండవసారి లోక్ సభలో ప్రవేశపెట్టారు.