2020-21 Budjet : ఆరోగ్య భారత్ కోసం ‘ఫిట్ ఇండియా’

  • Publish Date - February 1, 2020 / 06:54 AM IST

‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’అన్నారు పెద్దలు. దేశంలోని ప్రజలు ఆర్థికాభివృద్ధికి సాధించటంతో పాటు ఆరోగ్యాన్ని అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని దీంట్లో భాగంగా ‘ఫిట్ ఇండియా’’ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిపచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య భారతాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందనీ..ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధితో పాటు ఆనందంగా ఉంటుందని మంత్రి అన్నారు. 

ప్రతీ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే త్రాగునీరు ఉండాలని స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ‘‘జల జీవన్’’ విధానం ద్వారా అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు. అలాగే ‘‘మిషన్ ఇండియా’’ ద్వారా టీకాలు వేయిస్తున్నాం. 

కాగా..ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ‘ఫిట్ ఇండియా’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభిన విషయం తెలిసిందే. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, క్రీడల మధ్య అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ.