Greater Noida Buses Collided : గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు మృతి
గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ఇవాళ తెల్లవాజామున రెండు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
- bheemraj
- Published On : December 18, 2022 / 12:02 PM IST
buses collided
Greater Noida Buses Collided : గ్రేటర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ దగ్గర ఎక్స్ ప్రెస్ వేపై ఇవాళ తెల్లవాజామున రెండు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న నాలెడ్జ్ పార్క్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని మరో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు.
