Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..

తీవ్ర మంచు ప్రభావంతో రహదారి కనిపించకుండా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు.

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..

Road Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రహాయిచోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యులు తెలిపారు. బుధవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో – బహ్రాయిచో హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్ బస్సును ఢీకొట్టింది.

Road Accident One Died : ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మరణించారు. 15మందికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రప్రమాదానికి గురయ్యారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదంకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

తీవ్ర మంచు ప్రభావంతో రహదారి కనిపించకుండా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు.