ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్ల మధ్య ఓ గర్భిణి పడిన మానసిక..శారీరక వేదన గురించి వింటే హృదయం ద్రవించిపోతుంది. కారణం ఏదైనా..మనుషులపై మనుషలే దాడులు చేసుకునే ఇటువంటి అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన ఘర్షణల్లో షబానా పరీన్ అనే నిండు గర్భిణిపై అల్లరిమూకలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె కడపుపై తన్నారు. దీంతో ఆమె తల్లడిల్లిపోయింది విపరీతమైన నొప్పితో..కడుపులో బిడ్డకు ఏమైపోయిందనే తీవ్రమైన మానసకి ఒత్తిడితో కడుపు పట్టుకుని అక్కడిక్కడే కూలిపోయింది. బాధతో మెలికలు తిరిగిపోయింది. గిలగిల్లాడిపోయింది.
అలా 36 గంటలు నొప్పులు భరించి..భరించిన షబనా పర్వీన్(30) ఫిబ్రవరి 24న తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే..షబనా పర్వీన్ ఇంటిలోకి ఆందోళన కారులు చొరబడ్డారు. పర్వీన్ భర్త, అత్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డువచ్చిన పర్వీన్ ను గర్భిణి అని చూడకుండా..ఆమె పొత్తి కడుపుపై తన్నారు. అత్త, భర్తతో పాటు గర్భిణిని ఇంటి నుంచి బైటకు గెంటేశారు. ఆ తరువాత ఇంట్లోని వస్తువులన్నింటినీ ఒక చోట వేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
Also Read | ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్
రాక్షసుల్లా మారిన ఆందోళన కారులు కడుపుమీద తన్నటంతో పర్వీన్ తీవ్రమైన నొప్పులతో తల్లడిల్లిపోయింది. అలా బాధపడుతున్న పర్వీన్‌ను అదే రోజు రాత్రి దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు అతికష్టంమీద భర్తా..అత్త కలిసి తరలించారు. కానీ అక్కడి డాక్టర్లు ఆల్ హింద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ పురిటి నొప్పులతోనే తిరిగి ఆల్ హిద్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పండి. అలా 36 గంటల పాటు పర్వీన్ పురిటి నొప్పులు భరించాల్సి వచ్చింది. చివరకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పర్వీన్.
ఆ బిడ్డ తమకు మిరాకిల్ బేబీ అని పేరు పెట్టుకున్నామనీ..దేవుడు నిజంగానే అద్భుతం చేశాడనీ..ఆందోళన కారులు కడుపుమీద తన్నటంతో బిడ్డ ఏమైపోతందోనని చాలా ఆందోళన పడ్డామనీ కానీ భగవంతుడి దయవల్ల తమ బిడ్డ బ్రతికి బైటపడిందని..తమకు దేవుడు ఇచ్చిన ఈ బిడ్డకు మిరాకిల్ బేబీ అని పేరు పెట్టామని పర్వీన్ దంపతులు తెలిపారు. కాగా..పర్వీన్ ఇంటికి నిప్పు పెట్టడంతో.. ఇల్లు కోల్పోయిన వారు ఇప్పుడు ఎక్కడికో వెళ్లాలో తెలియని పరిస్థితి. అన్ని ఇంటిలోని వస్తువులు కాలిబూడిద అయ్యాయి. బంధువుల ఇంటికి వెళ్లడమే తమకున్న దారి అని పర్వీన్ అత్త నషీమా ఆవేదనతో తెలిపారు.