Shankaranna Suicide : 25ఏళ్ల యువతిని పెళ్లాడిన 45ఏళ్ల శంకరన్న ఆత్మహత్య.. అసలు కారణమిదే..!

Shankaranna Suicide : అప్పట్లో శంకరన్న, మేఘన పెళ్లి సెన్సేషన్.. 45ఏళ్ల శంకరన్న 25ఏళ్ల మేఘనను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయస్సు చాలా తేడా ఉండటంతో హేళన చేశారు.

45 Year Old Shankaranna Suicide Held By 25 Year Old Woman

Shankaranna Suicide : అప్పట్లో శంకరన్న, మేఘన పెళ్లి సెన్సేషన్.. 45ఏళ్ల శంకరన్న 25ఏళ్ల మేఘనను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయస్సు చాలా తేడా ఉండటంతో వీరిపై ట్రోల్స్ భారీగా వచ్చాయి. అలాగే ఈ జంటను అభినందించినవారు ఉన్నారు. వయస్సు పైబడిన కూడా పెళ్లి కాకపోవడంతో చివరికి భర్తకు దూరంగా ఉంటున్న మేఘనను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి వైవాహిక బంధం బాగానే కొనసాగింది. కొంతకాలంగా ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన శంకరన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుణిగల్ తాలూకాలోని హులియూర్ దుర్గలో జరిగింది. ఆరు నెలల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది.

ఇంట్లో తరచూ గొడవలు జరగడంతో శంకరన్న సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే శంకరన్న మృతదేహం అతని తోటలో లభ్యమైంది. శంకరన్నతో వివాహానికి ముందే మేఘనకు వివాహమైంది. తన భర్త మోసం చేశాడని, ఒంటరిగానే ఉంటున్నానని చెప్పి శంకరన్ననను పెళ్లాడింది. తుమకూరు జిల్లా, కుణిగల్‌లోని సంతెమావత్తూరు అనే గ్రామానికి చెందిన 20ఏళ్ల వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. భర్త నుంచి విడిపోయాక.. అదే తాలూకాలోని చౌదనకుప్పే గ్రామ సమీపంలోని అక్కిమిరిపాళియకు చెందిన శంకరన్నతో వివాహం జరిగింది. అప్పటికీ 45 ఏళ్ల శంకరన్నకు వివాహం కాలేదు. దాంతో మేఘన తనను పెళ్లి చేసుకోమని అడిగింది. అందుకు శంకరన్న కూడా అంగీకరించడంతో ఇద్దరూ దగ్గరలోని దేవాలయంలో వివాహం చేసుకున్నారు.

శంకరన్న భార్య కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయింది. తనను వివాహం చేసుకోవాలని మేఘనా శంకరన్నకు అడిగింది. భర్త దూరమై ఒంటరిగా ఉంటున్న మేఘనాను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలని శంకరన్న అనుకున్నాడు. శంకరన్న, మేఘనా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చలు జరిపారు.

వివాహం చేసుకున్న 6 నెలలకే శంకరన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకరన్న ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ ఉన్నట్టు సమాచారం. ఆ డెత్ నోట్‌లోని వివరాలు, అందులో ఏముంది అనేది పోలీసులు సమాచారం ఇవ్వడం లేదని స్థానికులు అంటున్నారు. శంకరన్న ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు. శంకరన్న భార్య మేఘనాను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

Read Also : Husband Murder Wife : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త