Husband Murder Wife : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త

భార్యను వదలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ.. భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు.

Husband Murder Wife : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త

Woman Burried

Updated On : March 30, 2022 / 9:33 AM IST

Husband Murder Wife : తమిళనాడులో ఓ శాడిస్టు భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా బతికున్న భార్యనే పూడ్చి పెట్టాడు. ఈ ఘటన వేలూరు జిల్లా కాట్పాడీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకం అనే వ్యక్తి.. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వినాయకం.. భార్యను వదలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ.. భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు. భార్యను మాయమాటలతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివ సహాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో బతికి ఉండగానే భార్యను పూడ్చి పెట్టాడు.

Chicken Curry : కోడికూర వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త

అనంతరం సుప్రజ కనిపించలేదంటూ తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుప్రజ తల్లిదండ్రులు వినాయకంపై ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బట్టబయలు అయింది. కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టిన పోలీసులు.. వినాయకంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీప్రాంతంలో పూడ్చిన పెట్టిన సుప్రజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.