నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)పోలింగ్ జరిగింది.వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 76.47శాతం,మధ్యప్రదేశ్ లో 65.86శాతం,ఒడిషాలో 64.05శాతం,జార్ఖండ్ లో 63.40శాతం,రాజస్థాన్ లో 62.86శాతం,ఉత్తరప్రదేశ్ లో 53.12శాతం,బీహార్ లో 53.67శాతం,మహారాష్ట్రలో 51.06శాతం,జమ్మూకశ్మీర్ లో అత్యల్పంగా 9.79శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
బీహార్ లోని 5లోక్ సభ స్థానాలకు,మధ్యప్రదేశ్ లోని 6స్థానాలకు,మహారాష్ట్రలోని 17స్థానాలకు,ఒడిషాలోని 6స్థానాలకు,రాజస్థాన్ లోని 13స్థానాలకు,ఉత్తరప్రదేశ్ లోని 13స్థానాలకు,వెస్ట్ బెంగాల్ లోని 8స్థానాలకు,జార్ఖండ్ లోని 3స్థానాలకు,జమ్మూకశ్మీర్ లోని 1లోక్ పభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది.
Also Read : గాల్లో తేలిపోతూ జర్నీ : డ్రైవర్ లెస్ Sky Train చూశారా?