నాగ్‌పూర్ హాస్పిటల్ నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పరార్!!

  • Publish Date - March 14, 2020 / 09:16 AM IST

కరోనాను నియంత్రించటానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ  ఏదో ఒక మూల కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ హాస్పిటల్ నుంచి నలుగురు కరోనా అనుమానితులు పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కరోనా సోకి ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ అధికారులు ఆందోళనచెందుతున్నారు. 

కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులు మాయో జనరల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుననాని నాగ్ పూర్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్.సూర్యవంశీ తెలిపారు. మార్చి 6న యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అదే మహారాష్ట్రలో మొదటి కరోనా కేసు. ఆ తరువాత మరో 10మంది కరోనా సోకినట్లుగా అనుమానిత కేసులు నమోదయ్యాయి.ఈ క్రమంలో నాగ్ పూర్ లో ఇద్దరు, ముంబై, పూణే, అహ్మద్ నగ్ లలో ఒక్కొక్కరు అనుమానితులగా నమోదవ్వగా..ఇప్పటికే మొత్తం 18కి ఈ సంఖ్య చేరుకుంది. 

Also Read | చంద్రబాబు, వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న జగన్ నిర్ణయం

కాగా..కరోనా భయంతో ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబై, ధానే,నవీ ముంబై, నాగ్ పూర్, వంటి ప్రాంతాల్లో శుక్రవారం (మార్చి 13,2020) అర్థరాత్రి నుంచీ మార్చి 30 వరకూ సినిమా థియేటర్లు, ఆడిటోరియాలు, జిమ్ లు, స్మిమ్మింగ్ పూల్స్ మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అలాగే 1897 లోని అంటు వ్యాధుల చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ఆంక్షలను ప్రభుత్వం విధించింది. కరోనా కేసులు ఎక్కువగా పూణేలోనే 10 నమోదయ్యాయి. దీంతో ప్రింప్రిచ్చినాడలోని అన్ని  ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. 10th క్లాస్ ఇంటర్ లకు ఎగ్జామ్స్ జరుగుతున్నందున వారికి సెలవులు ప్రకటించం కుదరలేదు.
 

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేయటం అనేది కరోనా వైరస్ పరిస్థితిని బట్టి ఉంటుందని ఆయా పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకంటామని తెలిపారు సీఎం. మత, సాంస్కృతిక, వాణిజ్య మరియు క్రీడా కార్యక్రమాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్వాహకులను మరియు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను అడుగుతుందని థాకరే చెప్పారు. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు జర్మనీ – ఏడు దేశాల నుండి వచ్చే వ్యక్తుల నిర్బంధ నిర్బంధం ఉండదని ఆయన ప్రకటించారు. 

Also Read | కరోనాపై భట్టి విక్రమార్క కామెంట్స్..కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్