Harappan City
Haryana: హర్యానాలోని రాఖీగర్హిలో 7వేల ఏళ్ల నాటి హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలు కూడా కనుగొన్నారు. ఆ సమయంలో ఈ నగరం నుంచి వ్యాపారం కూడా జరిగినట్లు సూచిస్తుంది.
అధికారుల ప్రకారం, ఆ సమయంలో నగరాలు మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. పెద్ద నగరాల నిర్మాణానికి ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నిక్‌లు, స్ట్రెయిట్ వీధులు, డ్రెయిన్‌లు, చెత్త కోసం వీధుల మూలల్లో ఉంచిన డస్ట్‌బిన్‌లు అప్పట్లోనూ ఉపయోగించారు.
తవ్వకాల్లో నగలతోపాటు ఇద్దరు మహిళల అస్థిపంజరాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. అస్థిపంజరాలతో పాటు మృతుడు ఉపయోగించిన పాత్రలను కూడా అక్కడే పాతిపెట్టారు.
Read Also : అంతర్వేది హార్బర్లో అరుదైన 750 కిలోల చేప లభ్యం
దీని చుట్టుపక్కల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కొత్త త్రవ్వకాలను నిర్వహిస్తోంది. ఇది మే చివరి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. రాఖీగర్హిలో త్రవ్వకం, స్టడీల ఫలితంగా ఇప్పటివరకు ఈ ప్రదేశంలో మెరుగైన ఇంజనీరింగ్‌తో రూపొందించబడిన సిస్టమాటిక్ నగరం ఉందని వెల్లడించింది.
రాఖీగర్హి అనేది హరప్పా నాగరికతతో కూడిన అతిపెద్ద పురావస్తు ప్రదేశం. ఇది రాఖీ-షాపూర్, రాఖీగర్హి-ఖాష్ అనే రెండు ఆధునిక గ్రామాల క్రిందకు వస్తుంది. రాఖీగర్హి హరప్పా సంస్కృతి ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రంగా వర్గీకరించబడింది.