హెయిర్ కట్ చేయించుకున్న ఆరుగురికి కరోనా

సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్న ఆరుగురికి కరోనా సోకినట్లు టెస్టుల్లో తేలింది. మధ్యప్రదేశ్ లోని జరిగిన ఘటనతో పోలీసులు గ్రామం మొత్తాన్ని సీల్ చేశారు. విచారణలో బార్గావ్ గ్రామానికి చెందిన బార్బర్ ఆరుగురికి ఒకటే గుడ్డ ఉపయోగించి షేవ్, హెయిర్ కట్ చేశాడు.  

ఇండోర్ లో పనిచేసే వ్యక్తిత లాక్‌డౌన్ కారణంగా ఇంటికొచ్చాడు. ఏప్రిల్ 5న గ్రామంలోని హెయిర్ సెలూన్ కు వెళ్లి షేవింగ్, హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతనికి COVID-19 ఉన్నట్లు తేలింది. అతని తర్వాత అదే సెలూన్ కు 12మంది వెళ్లారు. వారందరి నుంచి శాంపుల్స్ సేకరించి అదే రోజు టెస్టులకు పంపించారు డాక్టర్లు. 

కేవలం ఆరుగురికి కరోనా పాజిటివ్ రాగా, బార్బర్ కు నెగెటివ్ వచ్చింది. అదే గ్రామంలో 60కరోనా పాజిటివ్ కేసులు, 6 మృతులు నమోదైనా హెయిర్ కట్ లకు వెళ్లడం బాధ్యతారాహిత్యం. భారతదేశంలో 24వేల 942కు కేసులు పెరిగాయి. 779 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24గంటల్లో నమోదైన 1490 కేసులలో 56మృతులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న లాక్‌డౌన్‌లో కొద్ది షాపులకు అనుమతినిస్తూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మాల్స్, ఆహారేతర పరిశ్రమలు ఇంకా మూసే ఉంచుతారు.