Bihar: బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు

బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో వింత రీతిలో దొంగత‌నం జ‌రిగింది. 60 అడుగుల స్టీల్ వంతెనను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. స్థానిక అధికారులను, గ్రామస్థులను బురిడీ కొట్టించి ప‌ట్ట‌ప‌గ‌లు..

Brdige Theft

Bihar: బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో వింత రీతిలో దొంగత‌నం జ‌రిగింది. 60 అడుగుల స్టీల్ వంతెనను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. స్థానిక అధికారులను, గ్రామస్థులను బురిడీ కొట్టించి ప‌ట్ట‌ప‌గ‌లు ఈ వంతెనను దొంగిలించుకెళ్లిపోయారు.

నీటిపారుద‌ల‌శాఖ అధికారులం అని చెప్పి, గ్యాస్ క‌ట్ట‌ర్లు, ఎర్త్ మూవ‌ర్ మెషిన్లు ఉప‌యోగించి 3 రోజుల్లో మొత్తం వంతెన‌ను కూల్చేశార‌ని తెలిపారు. ఈ వంతెన తొల‌గించ‌డానికి స్థానిక నీటిపారుద‌ల‌శాఖ అధికారులు, గ్రామ‌స్తుల స‌హ‌కారం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. భారీగా ఐర‌న్ లూటీ చేసిన దొంగ‌లు ప‌రార‌య్యార‌ని కాసేపటి తర్వాత గానీ అధికారులకు అర్థం కాలేదు.

అమియావార్ గ్రామంలో న‌స్రిగంజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అర్రాహ్ కెనాల్‌పై 1972లో ఈ వంతెన నిర్మించారు. ఆ వంతెన పూర్తిగా పాత ప‌డిపోవ‌డంతోపాటు ప్ర‌మాద‌క‌రంగా మారింది. భయంతో స్థానిక గ్రామ‌స్తులు, చుట్టుప‌క్క‌ల గ్రామవాసులు వాడ‌టం మానేశారు. ప‌క్క‌నే కొత్త‌గా నిర్మించిన వంతెనను వినియోగించడం మొదలుపెట్టారు.

Read Also: రష్యా సైనికులను దొంగలను చేసిన యుద్ధం

నీటి పారుద‌ల‌శాఖ విభాగం అధికారుల నుంచి ఫిర్యాదు అందింద‌ని నస్రిగంజ్ ఎస్‌హెచ్‌వో సుభాష్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశామ‌ని చెప్పారు.

దొంగ‌ల‌ను గుర్తించ‌డానికి స్కెచ్‌లు వేసి.. స్క్రాప్ మెటీరియ‌ల్ విక్ర‌యించే వారితో కాంటాక్ట్ అయ్యారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.