ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది.. కర్ణాటకలో ఇడ్లీ తిండి పోటీలు రసవత్తరంగా జరిగాయి. రాష్ట్రంలోని మైసూరు జిల్లాల్లో మైసూరు దసరా పండగ వేడుకల సందర్భంగా ప్రత్యేకించి ఇడ్లీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఒక నిమిషం వ్యవధిలో ఎన్ని ఇడ్లీలు ఎక్కువగా తింటారో వారే గెలుస్తారు. ఇడ్లీ తిండి పోటీల్లో వివిధ వయస్సులకు చెందిన గ్రూపు మహిళలు పోటీపడ్డారు. పోటీలో భాగంగా పోటీదారులకు పెద్ద టేబుల్ పై ఇడ్లీతో పాటు శాంబార్ కూడా సర్వ్ చేస్తారు.
ఇందులో సరోజమ్మ అనే 60ఏళ్ల బామ్మ.. ఒక నిమిషంలో 6 ఇడ్లీలు అలవోకగా తినేసి పోటీలో గెలిచింది. మైసూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సరోజమ్మ.. ఇడ్లీలు తిని అక్కడి వారిందరని ఆశ్చర్యపరిచింది. నిర్వాహకులు తమ స్టాప్ వాచ్ ల ద్వారా ఇడ్లీలు తినే పోటీని నిర్వహించారు.
మైసూరులో దసరా పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాదిలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో వచ్చే ఈ దసరా పండగను 10 రోజుల పాటు మైసూరు వాసులంతా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు మైసూర్ దసరా సెలబ్రేషన్స్ జరుగనున్నాయి.