19ఏళ్లనుంచి టాయ్ లెట్ లోనే ఆమె నివాసం 

  • Publish Date - August 23, 2019 / 07:37 AM IST

ప్రతీ మనిషికీ కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గూడు, తినేందుకు తిండి ఉండాల్సిందే. ఇది ప్రతీ మనిషి హక్కు. కానీ దేశంలో ఎంతోమంది జానెడు కడుపు నింపుకునేందుకు పడరాన్ని పాట్లు పడుతున్నారు. ఉండటానికి గజం జాగా లేక..చెట్లకింద..ఫుట్ పాత్ లమీదే కాలం వెళ్లదీస్తున్నారు. దేశంలోఇటువంటివారి కోట్లాదిమంది ఉన్నారు. కానీ మరుగుదొడ్డినే నివాసంగా చేసుకుని కాలం వెళ్లదీస్తోంది ఓ వృద్దురాలు. అలా ఒకటీ రెండూ కాదే ఏకంగా 19 ఏళ్లనుంచీ ఆమె మరుగుదొడ్డిలోనే నివసిస్తోంది. 

మధురైలోని రామ్‌నాద్ ఏరియాలో కరుప్పైకు 65 ఏళ్లు. ఆమె గత 19 సంవత్సరాల నుంచి పబ్లిక్ టాయిలెట్‌లోనే జీవిస్తోంది. కరుప్పై జీవితగాథ వింటే గుండె చలించిపోతుంది. గత 19 ఏండ్ల నుంచి ఇదే పబ్లిక్ టాయిలెట్‌లో ఉంటున్నాననీ..ప్రతి రోజు టాయిలెట్స్‌ను శుభ్రం చేసుకుంటు ఉంటున్నానని కరుప్పై తెలిపింది.

పబ్లిక్ టాయ్ లెట్ కాబట్టి పలువురు అక్కడి వస్తుంటారు. వారు ఇచ్చే కొద్దిపాటి డబ్బుతోను ఆమె బ్రతుకును వెళ్లదీస్తోంది. అలా రోజు రూ. 70 నుంచి రూ.80ల వస్తాయనీ దీనంగా తెలిపింది. ఎవరో చెప్పగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాననీ..కానీ ఫలితం లేదని తెలిపింది. దీంతో కలెక్టర్‌ను కూడా సంప్రదించాననీ..అయినా తనకు  పెన్షన్ రావడం లేదనీ వాపోయింది. తనకు ఓ కూతురు కూడా ఉందనీ కానీ ఆమె తన గురించి పట్టించుకోలేదనీ..కనీసం తనను చూసేందుకుకూడా ఎప్పుడు రాలేదనీ కన్నీరు పెట్టుకుంది. బ్రతకటానికి టాయ్ లెట్ మాత్రమే తనకు  ఆధారంమంది. కరుప్పై టాయ్ లెట్ లో నివాసముంటున్న  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.