పశ్చిమబెంగాల్‌లోని పురులియా జిల్లాకు చెందిన ఏడుగురు కార్మికులు చెట్టుపైనే 14రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. చెన్నైలో పని చేసుకుంటున్న వారికి తిరుగుప్రయాణమయ్యాక ఐసోలేషన్ కోసం విడి గదులు లేకపోవడంతో చెట్టుపైనే ఉండాల్సి వచ్చిందట. గ్రామానికి వచ్చిన వెంటనే డాక్టర్ వారిని 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. దీంతో గ్రామం దగ్గర్లోని చెట్టే ఐసోలేషన్ కు చోటుగా మారింది.
కార్మికులలో ఒకడైన బిజోయ్ సింగ్ లాయా అనే వ్యక్తి ‘మేం చెన్నై నుంచి తిరిగొచ్చిన ఓ వాహనంలో బరంపూర్ మీదుగా వచ్చాం. డాక్టర్లు ఇంట్లోనే 14రోజుల పాటు ఉండాలని ఒకరికి ఒకరు కనీస దూరం పాటించాలని సూచించారు. కానీ, మా ఇంట్లో పర్సనల్ రూమ్స్ లేవు. మా గ్రామస్థులంతా మేం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు’
‘మేం సొంతగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ సౌకర్యంగానే ఉంటున్నాం. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో అన్నం తింటున్నాం. ఇక్కడ నీళ్లు కూడా దొరుకుతున్నాయి. వంట చేసుకోవడానికి, నీళ్లు కాచుకోవడానికి, ఆహారం తయారుచేసుకోవడానికి పొయ్యి కూడా ఉంది’ అని చెప్పుకొచ్చాడో కార్మికుడు.
వీరంతా చెట్టుపై కొమ్మలకు గుడ్డ కట్టి కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొవిడ్-19ను బ్రేక్ చేయడానికి వాళ్లు ఇలా సిద్ధమయ్యారు.