Mohan Bhagwat: బ్రిటిషర్లకు ముందు ఇండియాలో 70% అక్షరాస్యులట.. అప్పుడు బ్రిటన్‭లో 17%

దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం తమ కోసం కాదని, అది పూర్తిగా ధర్మం కోసమని అన్నారు

Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లు రాకముందు మన దేశంలో 70 శాతం మంది ప్రజలు చదువుకుని ఉన్నారట. అంతే కాదు, ఆ సమయంలో ఇక్కడ నిరుద్యోగం కూడా లేదట. ఇంకో విషయం ఏంటంటే.. ఆ సమయంలో బ్రిటిషర్లలో కేవలం 17 శాతమే చదువుకున్నవారు ఉన్నారట. అనంతరం కాలంలో బ్రిటిషర్లు ఇండియాకు రావడం, వాళ్ల విద్యావిధానం ఇక్కడ అమలు చేసి, ఆ దేశాన్ని 70 శాతం అక్షరాస్యతగా మార్చుకుని మన దేశాన్ని మాత్రం 17 శాతం అక్షరాస్యతకు పడగొట్టారట.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయం.. బీఆర్ఎస్, ఆప్ తో చర్చలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రి-కర్నాల్ రోడ్డులో నిర్మించిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలివి. ‘‘బ్రిటిషర్లు ఈ దేశాన్ని పాలించకముందు ఇక్కడి ప్రజల్లో 70 శాతం మంది విద్యావంతులు. చాలా నైపుణ్యాలు కలిగినవారు. ఇక్కడ అసలు నిరుద్యోగమే లేదు. అప్పుడు ఇంగ్లాండులో కేవలం 17 శాతమే విద్యావంతులు ఉన్నారు. బ్రిటిషర్లు వారి విద్యావిధానాన్ని మన దేశంలో అమలు చేశారు. దాంతో 70 శాతంగా ఉన్న దేశ అక్షరాస్యత 17 శాతానికి తగ్గింది’’ అని అన్నారు.

Tripura: మాణిక్ సాహానే మళ్లీ సీఎం.. రెండోసారి ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మన దేశంలో ఉన్న విద్యావ్యవస్థ కేవలం ఉపాధిని సంపాదించేదే కాదు. జ్ణానానికి మార్గం అది. ఇక్కడ విద్య అందరికీ అందుబాటులో ఉండేది, పైగా చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో దొరికేది. అందుకే చదువుకు అయ్యే ఖర్చులన్నీ సమాజమే భరించేది. ఈ విద్యను అభ్యసించిన పండితులు, కళాకారులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు’’ అని భాగవత్ అన్నారు. ఇక సాధారణ ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు వీలుగా ఆసుపత్రి నిర్మాణం చేసిన ఆటం మనోహర్ ముని ఆశ్రంను ఆయన ప్రశంసించారు.

Holi 2023: మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగ చేసుకోవాలి: సీఎం కేసీఆర్

దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం తమ కోసం కాదని, అది పూర్తిగా ధర్మం కోసమని అన్నారు. ‘సర్వ జన హితాయ-సర్వజన సుఖాయ’ అని భాగవత్ నినదించారు.

ట్రెండింగ్ వార్తలు