దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. సోమవారం(డిసెంబర్ 23,2019) తెల్లవారుజామున సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసింది. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ప్రమాదం జరిగిన భవనం 3 అంతస్తుల బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో వస్త్ర గోదాము గోడౌన్ ఉంది. ఈ బిల్డింగ్ లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే.. అలర్ట్ చేయడానికి కానీ, మంటలు ఆర్పేందుకు కానీ పరికరాలు, వ్యవస్థ లేదు. కేవలం మెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రమాదం జరిగితే బయటపడటానికి మరో దారి కూడా లేదని అధికారులు గుర్తించారు.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని అనాజ్ మండీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 43మంది చనిపోయారు. ఆ భవనానికి కూడా ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు. బిల్డింగ్ ఓనర్, మేనేజర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస అగ్ని ప్రమాదాలు స్థానికులను భయపెడుతున్నాయి. ఉపాధి కోసం వెళ్తే ప్రాణాలే పోతున్నాయి. అనేక కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంటోంది.
Delhi: Three people have died and 10 have been injured after a fire broke out in a cloth godown in Kirari at around 12:30 am, today. The fire has been doused and the injured have been admitted to hospital. pic.twitter.com/VDDQW0STAk
— ANI (@ANI) December 22, 2019