Corona Cases : దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు.. 477 మంది మృతి
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 477 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- bheemraj
- Published On : December 2, 2021 / 02:21 PM IST
Corona
new corona cases in india : భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 477 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటి నమోదైన పాజిటివ్ కేసుల కంటే ఇవి 8 శాతం అధికమని తెలిపింది.
నిన్న కొత్తగా 8,954 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతి చెందారు. దేశంలో 99,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
MLC : తెలంగాణ శాసనమండలిలో ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
గత 24 గంటల్లో కొత్తగా 8,548 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 1,24,96,19,515 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో బుధవారం 80,35,261 మందికి టీకా వేశారు.
