9వ జాతీయ ఓటర్ల దినోత్సవం: ఈసీ శుభాకాంక్షలు 

  • Publish Date - January 25, 2019 / 04:43 AM IST

జనవరి 25 జాతీయ ఓటర్స్ డే
జనవరి 2011 ప్రారంభమైన ఓటర్స్ డే 
దేశ ప్రజలకు ఈసీ శుభాకాంక్షలు
ప్రజాస్వామ్యంలో అందరు పాల్గొనాలని పిలుపు

హైదరాబాద్ : 9వ జాతీయ ఓటర్ల దినోత్సవరం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఏ ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జనవరి 2011 జనవరి 25 నుండి ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఈసీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జనవరి 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఓటుహక్కు లేనివారు, జాబితాలో పేర్లు గల్లంతైనవారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వయోజనులందరు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. 

దరఖాస్తులను, అభ్యంతరాలు, ఫిర్యాదులను ఫిబ్రవరి 11వ తేదీలోగా పరిష్కరించి, ఫిబ్రవరి 22న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో లేదా ఎమ్మార్వో కార్యాలయాలు, పోలింగ్ బూత్‌లవారీగా ఎన్నికల అధికారులు నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారు. తాజా ఓటరు నమోదు ప్రక్రియలో మరో 20 లక్షల మంది నమోదవుతారని అంచనా. దీన్ని బట్టి తుది జాబితా లో రాష్ట్ర ఓటర్లు మూడు కోట్లు దాటుతారని అధికారులు చెప్తున్నారు.
ప్రజాస్వామ్యంలో అంతా పాల్గొనాలి :  రజత్ కుమార్ 
తెలంగాణలో సుస్థిర క్రియాశీల ప్రభుత్వం కలిగి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా..2018 ఎన్నికల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఒక్క అవాంఛనీయం ఘటన కూడా జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించింది ఈసీ. గతంలో ఓటింగ్ 69.5గా వున్న శాతాన్ని ఈసీ సమర్ధవంతమైన నిర్వహణతో 73.4 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంది. ఇది ఈసీ సమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 25 ఓటర్ల దినోత్సం సందర్భంగా  రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు ఎన్నికల అధికారి రావత్ రాష్ట్ర ప్రజలకు కృతజ్నతలు తెలిపారు.అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా సహకరించాలని కోరారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాల సవరణ 1.1.2019 నుండి ప్రారంభం కాగా..ఫిబ్రవరి 4 తేదీ వరకు కొనసాగుతుందనీ..ఈ అవకాశాన్ని అందరు (18 సంవత్సరాలు నిండినవారు)  వినియోగించుకుని తమ ఓట్లను నమోదు చేసుకోవాలనీ..పొరపాట్లు వుంటే సరిదిద్దుకునేలా చేసుకోవాలని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు కావాలని  రజత్ కుమార్ పిలుపునిచ్చారు. 

ఓటర్లకు ఈసీ ఉన్నత అధికారి సునీల్ అరోరా శుభాకాంక్షలు 
దేశంలోని పౌరులంతా 18 సంవత్సరాలు నిండినవారంతా తమ ఓటును నమోదు చేసుకోబోతున్నవారందరికి ఈసీ ఉన్నత అధికారి సునీల్ అరోరా శుభాకాంక్షలు తెలిపారు. యూవత దేశమంతలా 17వ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంగా తాము కూడా దేశంలోని 87 కోట్లకు పైగా ఓటర్లకు..10 లక్షల పోలింగ్ కేంద్రాలను నిర్వహించుకునే అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఓటరు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 25 1950న భారత ఎన్నికల సంఘం స్ధాపించబడిన రోజనీ..భారతదేశం ప్రజా స్వామ్య వ్యవస్థ సుస్థాపితం చేసిన రోజు కాబట్టి ఈరోజు ఇది తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజని సునీల్ అరోరా పేర్కొన్నారు. 

ట్రెండింగ్ వార్తలు