Coconut Tree: నట్టింట్లో చెట్టును కదలించింకుండా రెండస్తుల నిర్మాణం.. తాత జ్ఞాపకాలను కాపాడటం కోసం కుటుంబం విశిష్ట ప్రయోగం

దీంతో చెట్టును నరికివేయకుండా చుట్టూ ఇంటిని ఎందుకు నిర్మించకూడదని కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు అరిందం. అనంతరం ఇల్లు కట్టే తాపీ మేస్త్రీకి తమ తంతంగం మొత్తం వివరించానే. చుట్టుపక్కల వారికి తెలియడంతో చెట్టు నరికిన తర్వాతే ఇల్లు కట్టుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని చెప్పారు. ఎవరెంత చెప్పినా వారు పట్టించుకోలేదు

Coconut Tree: ఇళ్లు కట్టుకోవడానికి ప్రజలు చాలా చెట్లను నరికివేస్తుంటారు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఓ కుటుంబం మాత్రం.. నట్టింట్లో ఉన్న చెట్టును కదిలించకుండా రెండంస్తుల ఇల్లు కట్టుకుంది. తూర్పు బుర్ద్వాన్‌లో ఓ పోలీసు అధికారి ఇంట్లో కనిపించిన దృశ్యం ఇది. కారణం, తన తాత 35 ఏళ్ల క్రితం నాటిన చెట్టట అది. ఆ చెట్టులో తాత జ్ణాపకాలను దాచుకోవాలనుకున్న ఆ కుటుంబం.. చెట్టుకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, దాని చుట్టూ ఇంటి నిర్మాణం చేశారు.

Pak Army Chief: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‭గా బాధ్యతలు స్వీకరించిన ఆసిం మునీర్

అరిందం అనే వ్యక్తి మంత్వేశ్వర్‌లోని దౌకడంగా గ్రామ నివాసి. హౌరా పోలీస్ కమిషనరేట్‌లోని దాస్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. తన కుటుంబం డౌకడంగలోని పాత ఇంట్లో నివసిస్తుంది. అయితే తాము ఉంటున్న ఇంట్లోనే కొత్తిల్లు కట్టాలని అనుకున్నారు. కానీ, ఇక్కడొక సమస్య ఏర్పడింది. ఆ ఇంట్లో 35 ఏళ్ల క్రితం తన తాత విశ్వనాథ్ కోనార్ స్వయంగా నాటిన కొబ్బరి చెట్టు ఉంది. అది ఆయన జ్ణాపకార్థంగా ఉంది. అరిందం సహా అతని కుటుంబీకులంతా ఆ చెట్టును బాగా ఇష్టపడతారు. కానీ ఈ చెట్టును నరికివేయకుండా ఇల్లు కట్టుకోలేకపోవడమే ఇక్కడ ఎదురైన అసలు సమస్య. అలా అని వారు తాతగారి జ్ణాపకాన్ని చెరిపేయాలని అనుకోలేదు. 25 సంవత్సరాల క్రితం 80 సంవత్సరాల వయస్సులో ఉండగా తాత మణించాడు. ఈ చెట్టును చూడగానే ఆ కుటుంబానికి తాత తమతో ఉన్నట్లుగానే అనిపిస్తుందట. ఈ కొబ్బరి చెట్టు మూడంతస్తుల భవనం కంటే ఎత్తుగా ఉంటుంది.

Thailand: డ్రగ్స్ పరీక్షల్లో అందరికందరూ దొరికిపోయారు.. ఇప్పుడా గుడిలో ఒక్క సన్యాసి కూడా లేరు

దీంతో చెట్టును నరికివేయకుండా చుట్టూ ఇంటిని ఎందుకు నిర్మించకూడదని కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు అరిందం. అనంతరం ఇల్లు కట్టే తాపీ మేస్త్రీకి తమ తంతంగం మొత్తం వివరించానే. చుట్టుపక్కల వారికి తెలియడంతో చెట్టు నరికిన తర్వాతే ఇల్లు కట్టుకోవాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని చెప్పారు. ఎవరెంత చెప్పినా వారు పట్టించుకోలేదు. మొత్తానికి ఆ కొబ్బరి చెట్టును నరకకుండానే ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తైందట. ఇంటి పైనుండి చెట్టు కొమ్మలు, ఆకులు కనపడడం వల్ల ఇంటి అందం మరింత పెరిగిందని అరిందం కుటుంబ సభ్యులే కాదు, చుట్టు పక్కల వారు కూడా మురిసిపోతున్నారు.

Gujarat Polls: ఉగ్రవాదంపై కాంగ్రెస్‭ను టార్గెట్ చేసిన మోదీ.. ఇందిరా, రాజీవ్ మరణాన్ని గుర్తు చేస్తూ ఖర్గే కౌంటర్ అటాక్

ట్రెండింగ్ వార్తలు