Uttar Pradesh: షాకింగ్ ఘటన.. నీళ్లు అనుకొని యాసిడ్ తాగేసింది.. యువతి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హాపూర్‌లో తాగునీరు, గృహోపయోగ రసాయనాల ప్యాకేజింగ్‌లో జరుగుతున్న ఘోరమైన నిర్లక్ష్యానికి ఈ ప్రమాదం అద్దం పడుతోంది.
- V Santhosh Kumar
- Published on- July 12, 2026 / 05:00 PM IST
A woman drink acid mistaking it for water her condition has become critical in uttar pradesh
-
నీళ్లు అనుకుని యాసిడ్ తాగింది
-
యువతి పరిస్థితి అత్యంత విషమం
-
షాప్ యజమాని పోలీస్ కస్టడీ
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తాగునీరు, గృహోపయోగ రసాయనాల ప్యాకేజింగ్‌లో జరుగుతున్న ఘోరమైన నిర్లక్ష్యానికి ఈ ప్రమాదం అద్దం పడుతోంది. నమ్మకమైన సీల్డ్ బాటిల్‌లోనే నీళ్లకు బదులు యాసిడ్ రావడంతో ఒక అమాయక యువతి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అర్జున్ నగర్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఓ యువతి ఆభరణాల దుకాణానికి వెళ్లింది. దాహంగా ఉండటంతో ఆమె నీళ్లు అడగ్గా, సదరు యజమాని పక్కనే ఉన్న స్వీట్ షాప్ నుండి ఒక సీల్డ్ వాటర్ బాటిల్‌ను తెప్పించి ఇచ్చాడు.
Ktr: రక్త పిశాచీ.. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతారా.. కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్
అయితే, ఆ బాటిల్ తెరిచి నీళ్లలాగే భావించి తాగిన ఆ యువతికి వెంటనే నోరంతా తీవ్రంగా మండిపోయింది. బాటిల్‌లో ఉన్నది రసాయన ద్రావణం (యాసిడ్) అని గుర్తించిన స్థానికులు ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు స్వీట్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకోగా, తనకు కంపెనీ నుండి వచ్చిన సీల్డ్ బాటిల్‌నే విక్రయించానని, అందులో యాసిడ్ ఉందనే విషయం తనకు తెలియదని అతడు తెలిపాడు. నిర్లక్ష్యానికి(Uttar Pradesh) కారణమైన సరఫరాదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
