Balasore ATM Robbery : ఓరి వీళ్ల దుంపతెగ.. ఏటీఎంనే ఈడ్చుకెళ్లారు.. వెబ్ సిరీస్‌లో సీన్‌ను దించేసిన దొంగలు.. వీడియో వైరల్
Balasore ATM Robbery : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Balasore ATM Robbery
Balasore ATM Robbery : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీ ఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. దుండగులు మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఉపయోగించి ఏటీఎం యంత్రాన్ని మొత్తం పీకేసి అక్కడి నుంచి తీసుకెళ్లి, అనంతరం అందులోని నగదును దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Also Read : Hyderabad Crime: ఆరు హత్యలు.. ఏడు ఇటుకలు.. షాబాద్ మర్డర్ మిస్టరీ
సినీ ఫక్కీలో దొంగలు ఏటీఎం దోపిడీకి పాల్పడ్డారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రీతమ్ అండ్ పెద్రోలో దొంగలు ఏటీఎంను ఓ వాహనం సహాయంతో లాక్కెళ్లి దోపిడీకి పాల్పడతారు.. అదేతరహా ఒడిశాలో దొంగలు ఏటీఎం దోపిడీకి పాల్పడ్డారు. బాలాసోర్ జిల్లా ఖైరా ప్రాంతంలోని ఓ ఇండియా వన్ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుజామున థార్ వాహనానికి తాడుతో ఏటీఎంను కట్టి బలంగా లాగారు. దీంతో ఏటీఎం యంత్రం పూర్తిగా బయటకు వచ్చేసింది. అనంతరం దానిని వాహనంలో తీసుకెళ్లి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో పగులగొట్టి అందులోని నగదును తీసుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, థార్ వాహనం వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఏటీఎంలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.
CCTV captured a dramatic ATM theft in Baleshwar, Odisha.
The robbers tied a rope to a Thar, uprooted the ATM, and dragged it along the road before fleeing.
The entire movie-style mega-heist was captured on nearby surveillance cameras. pic.twitter.com/M2GwaSRpvO
— Manas Muduli (@manas_muduli) July 11, 2026
