Ktr: రక్త పిశాచీ.. నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతారా.. కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని కోరిన ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్(Ktr) 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు.
KTR expressed anger at the Congress regarding the irrigation issue.
- కాంగ్రెస్ ఒక రక్త పిశాచి
- రైతుల కోసం రక్తం ధారపోస్తాం
- సాగునీరు ఇవ్వకుంటే తీవ్ర పోరాటం
Ktr: తెలంగాణలో ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని కోరిన ప్రతిపక్షాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా రక్త పిశాచీ” అంటూ ప్రభుత్వ వైఖరిని ఆయన కడిగిపారేశారు. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణను పీడించి, ఇక్కడి బిడ్డల రక్తాన్ని తాగిన కాంగ్రెస్ తోడేలు రక్తదాహం ఇంకా తీరలేదా అని నిలదీశారు. గతంలో ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ యువతను పిట్టల్లా కాల్చి చంపిన నరహంతక చరిత్ర కాంగ్రెస్‌దేనని, 1952, 1969 ఉద్యమాలతో పాటు మలిదశ పోరాటంలోనూ వేలాది మంది అమరత్వానికి ఆ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేతులకు అంటిన తెలంగాణ బిడ్డల రక్తపు మరకలు ఎప్పటికీ చెరిగిపోవని విమర్శించారు.
Vijayawada: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. వెల్డింగ్ చేస్తుండగా పేలుడు.. 7 బస్సులు దగ్ధం
తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడి, జలసాధన ఉద్యమాలతో నీళ్లు తెచ్చిన చరిత్ర తమదని కేటీఆర్ స్పష్టం చేశారు. నెత్తురు ఇస్తేనే నీళ్లు ఇస్తామనే కర్కశ నిబంధనలు పెడితే, రైతుల కోసం తమ రక్తాన్ని ధారపోయడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలకులు తమ రక్తదాహాన్ని తీర్చుకుని, ఎండిపోతున్న పొలాల జలదాహాన్ని తీర్చాలని డిమాండ్ చేశారు. అన్నదాతల హక్కుల కోసం తాము ఎంతటి త్యాగానికైనా వెనకాడబోమని, రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని కేటీఆర్(Ktr) గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
