iQOO 15R Deal : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఐక్యూ 15R భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
iQOO 15R Deal : ఐక్యూ సరికొత్త ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఐక్యూ 15ఆర్ కొనుగోలుపై రూ. 6వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
iQOO 15R Launch
- ఐక్యూ 15ఆర్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే
- 7600mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16
- అమెజాన్ నుంచి బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే
iQOO 15R Deal : కొత్త ఐక్యూ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ 15Rపై భారీ తగ్గింపు అందిస్తోంది. అద్భుతమైన బ్యాటరీ, కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు కంపెనీ బ్యాంక్ ఆఫర్లతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 4వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్ నుంచి మరింత తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఐక్యూ 15Rపై బెస్ట్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐక్యూ 15ఆర్ డిస్కౌంట్ ధర :
ప్రస్తుతం ఐక్యూ 15ఆర్ ఫోన్ అతి చౌకైన ధరకు లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ అసలు ధర రూ.53,999 కాగా, ఇప్పుడు రూ.49,999కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. మరిన్ని ఆఫర్ల కోసం అమెజాన్ ఆఫర్ పేజీని విజిట్ చేయండి.
ఐక్యూ 15R స్పెసిఫికేషన్లు :
ఐక్యూ 15ఆర్‌లో 1260 x 2750 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ HDR10+ సర్టిఫైడ్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో రన్ అవుతుంది. 12జీబీ LPDDR5x ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందిస్తుంది. ఇందులో 100W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 7,600mAh బ్యాటరీ ఉంది. బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఐక్యూ 15Rలో OISతో 50MP రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+ IP69 రేటింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.9mm సన్నని ఆకృతి ఉంటుంది. ఇందులో స్పెషల్ క్యూ2 గేమింగ్ చిప్ కూడా ఉంది.
