బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలని ఆప్ లేఖ

  • Publish Date - January 23, 2020 / 12:28 AM IST

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్‌ మిశ్రా నామినేషన్‌ను తిరస్కరించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఢీల్లీ ఎన్నికల అధికారికి లేఖ రాసింది. ఆయన సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉందని ఆప్ ఆరోపించింది. నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని లేఖలో పేర్కొంది.  

మోడల్‌ టౌన్‌ నియోజకవర్గం నుంచి కపిల్‌ మిశ్రా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. 2020, ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తోంది.  ఫలితాలు 2020, ఫిబ్రవరి 11న వెలువడనున్నాయి.