AAP MLA arrested : వక్ఫ్‌ బోర్డు నియామకాల్లో అక్రమాలు .. ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్

ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.

AAP MLA Amanatullah Khan arrested : ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం (సెప్టెంబర్ 16,2022) అరెస్ట్ చేశారు. ఖాన్‌ చైర్మన్‌గా ఉన్న ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఖాన్‌తోపాటు అతడి అనుచరుల నివాసాలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో రూ.24 లక్షలను సీజ్ చేశారు. నగదుతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలను సీజ్‌ చేసామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసులో సాక్షులను అమానతుల్లాఖాన్‌ బెదిరించే అవకాశం ఉందని అందుకే అతనిని అరెస్ట్ చేశామని తెలిపారు. అలాగే వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సెక్రటేరియట్‌కు ఏసీబీ లేఖ రాసింది.

కాగా వక్ఫ్ బోర్డులో జరిగిన అవకతవకలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఎఫ్ఐఆర్ లో ఆరోపించినట్లుగా ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించినట్లుగా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు అన్ని నిబంధనలను.. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించారని..32 మందిని అక్రమంగా నియమించుకురని పేర్కొంది. అంతేకాకుండా వక్ఫ్ బోర్డుకు సంబంధించి అనేక ఆస్తులను అక్రమంగా అద్దెకి ఇచ్చారని..నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించబడింది.

 

ట్రెండింగ్ వార్తలు