Punjab Cm
Punjab Elections: మరి కొద్ది వారాల్లో జరగబోయే పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా సూచించినట్లే జనవరి 18 మధ్యాహ్నం 12గంటలకు భగవత్ మన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారు కేజ్రీవాల్. గతేడాది ఒకానొక సందర్భంలో సిక్ కమ్యూనిటీ నుంచే సీఎం అభ్యర్తి ఉంటారని తెలిపిన కేజ్రీవాల్ మాట నిలబెట్టుకున్నారు.
ఫోన్ నెంబర్ ఇచ్చి ఒపీనియన్ పోల్ తీసుకున్న కేజ్రీవాల్.. జనవరి 17లోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు. వేదికపై భగవత్ మన్ పేరు ప్రకటించి కౌగిలించి అభినందించారు. ఆనందంలో కన్నీటి పర్యంతమైన మన్ కు.. వేదికపై ఉన్న పెద్దలంతా అభినందనలు తెలియజేశారు.
గతంలో నటుడైన భగవత్ కు సంబంధించి ముఖ్య విషయాలు:
* 2014, మార్చిలో ఆప్ లో చేరిన భగవంత్ మాన్
* 2014 లో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఆప్ లోక్ సభ ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన భగవంత్ మాన్..
* 2019 సంగ్రూర్ లో తిరిగి లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించిన భగవంత్ మాన్.
* ప్రస్తుతం పంజబ్ ఆప్ కన్వీనర్‌గా కొనసాగుతోన్న భగవంత్
* 2012 లో పీపుల్స్ పార్టీ ఆప్ పంజాజ్ నుంచి లెహర నియోజక వర్గం నుంచి పోటి.