హైదరాబాద్ : పుల్వామా మానవబాంబు దాడి అనంతరం పాక్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మిరాజ్ 2000 విమానాలతో విరుచుకుపడింది. ఈ సాహసోపేత దాడిలో పాల్గొన్నవారిలో IAF కమాండర్ అభినందన్ వర్తమాన్ ఒకరు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 బైసన్ పైలట్ కమాండర్ అభినందన్ వర్తమాన్. పాకిస్థాన్ కు పట్టుబడ్డారు. ఆయన ట్రైనింగ్ తీసుకున్నది హైదరాబాద్ లోనే.
అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపనూరు. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. ఈ క్రమంలో IAFలో చేరాలని ఆయన కలకన్నారు. ఆ కలను సారారం చేసుకునే దిశగా ఆయన విద్యాభ్యాసం సాగించారు. ఈ క్రమంలోనే ఆయన చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ లోని దుండిగల్, హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఫైటర్ పైలెట్ గా ట్రైనింగ్ పూర్తయిన తరువాత బెంగళూరులో ఎలహన్కా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు అభినందన్.
Read Also : ఫండింగ్ కోసం జైషే మహ్మద్ కొత్త పంథా: ఏం చేస్తుందంటే
యుద్ధ విమానాలను నడపడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అందుకే ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకున్న అభినందన్‌కు IAF కీలక బాధ్యతలు అప్పగించించింది. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ IAF విరుచుకుపడి 350 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టింది. దీంతో భారత దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దెబ్బకు దెబ్బ తీసిన IAFకు నీరాజనాలు పలుకుతున్నారు.
ఇండియన్ భూ భాగంలోకి వచ్చిన పాకిస్థాన్ యుద్ద విమానం ఎఫ్ 16 ను తరిమి కొట్టి కూల్చేసిన తరువాత మిగ్ 21 బైసన్ విమానం అదే స్పీడ్ లో పాకిస్థాన్ గగనతలం పైకి వెళ్లి పోయి ఆ తర్వాత టెక్నికల్ కారణంతో పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. విమానం కూలిపోతున్న సమయంలో అభినందన్ ప్యారచూట్ సాయంతో పాకిస్థాన్ నేలపై ఆయన దిగారు. భారత్ పై రగిలి పోతున్న పాకిస్థాన్ వారికి అభినందన్ దొరకడంతో వారు రెచ్చి పోయారు. సేఫ్ గా కిందకు దిగిన అభినందన్ ను పాక్ సేనకు పట్టుబడ్డారు.
Read Also: సమ్మర్ కూల్ ఎలా : తెలంగాణలో బీర్లు బంద్
కాగా అభినందన్ క్షేమంగా తిరిగి రావాలం భారతీయులంతా ప్రార్థనలు చేస్తున్నారు. భారతీయుల సత్తాను చాటి చెప్పిన అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు భారతదేశం యావత్తు కోరుకుంటోంది. ఆయన క్షేమంగా రావాలని ఆయన కుటుంబ సభ్యులకు ఆనందనం కలిగాలని కోరుకుందాం. అభినందన్ తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం అభినందన్ కుటుంబం చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నివసిస్తోంది.