అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు

ఫిబ్రవరి 27 నుంచి భారతదేశమంతటా ఒకటే పేరు అభినందన్.. మొక్కులు అందుకోని దేవుడు లేడు. అడగకుండా ఉన్న మనిషి లేడు. సాధారణ అధికారి నుంచి దేశోన్నత పదవిలో ఉన్న ప్రధాని వరకూ అందరూ పాక్ అదుపులో ఉన్న అభినందన్ ను భారత్ కు తీసుకురావాలనే కాంక్షతో కంటికి కునుకు లేకుండా ఎదురుచూశారు. భారత ఆశలు ఫలించాయి. పాకిస్తాన్ అభినందన్‌ను విడుదల చేస్తామంటూ 48 గంటల తర్వాత శుభవార్త వినిపించింది. 
Read Also : ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్‌ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల సంగతేంటి?

వస్తున్నాడు.. మనోడు వస్తున్నాడు.. హీరో వస్తున్నాడంటూ దేశ పౌరులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా సినీ తారలు సైతం అభినందన్ ను స్వాగతించేందుకు సిద్ధమైయ్యారు. ట్విట్టర్ వేదికగా అభినందన్ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు. 

వీరిలో కరణ్ జోహార్, ఇమ్రాన్ హష్మీ, అనుపమ్ ఖేర్ లతో పాటు మరికొందరు ప్రముఖులు చేరారు. 

Read Also : వెల్‌కమ్ అభినందన్, అప్పుడే అయిపోయిందనుకోవద్దు