ఎన్నికల అధికారులపై నటి నమిత మండిపడింది. తన కారును ఎందుకు ఆపారంటు రుసరుసలాడింది. అధికారులతో గొడవ పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో వాహనాలను తనిఖీలు కొనసాగిస్తున్నారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలో తమిళనాడులోని సేలం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఊహించని సందర్భం ఎదురైంది. సేలం సమీపంలోని కొండలాంపట్టి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో అటుగా వచ్చిన నటి నమితను అధికారులు అడ్డగించారు. దీంతో వారిపై నమిత అంతెత్తున ఎగిరిపడింది.
ఫ్లయింగ్ స్క్వాడ్ కు టీమ్ అధికారి ఆనంద్ విజయ్ మాట్లాడుతు..ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని..ఎవరైనా సరే చెక్కింగ్ చేస్తామని స్పష్టం చేశారు. ఆనంద్ విజయ్ గట్టిగా మాట్లాడడంతో కాస్తంత తగ్గిన నమిత తన కారులో చెక్కింగ్ కు తనిఖీలు చేసేందుకు సహకరించటం..ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేయటంతో నమిత సైలెంట్ గా వెళ్లిపోయింది.