Religious Conversions: నచ్చిన మతాన్ని ఎంచుకోవడం, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి హక్కు, తేల్చిచెప్పిన సుప్రీం

బీజేపీ లీడర్ అశ్విని ఉపాధ్యాయ్ ఫైల్ చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మతమార్పిడులపై...

supreme court

Religious Conversions: బీజేపీ లీడర్ అశ్విని ఉపాధ్యాయ్ ఫైల్ చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మతమార్పిడులపై కేంద్రం చేసిన చట్టాలను కఠినతరం చేయాలనే పిటిషన్ పై విచారణ జరిపింది. జస్టిస్ రోహింటన్ ఫలీ నారిమన్ అధ్యక్షతన జరిగిన బెంచ్ ఇలా ఆదేశాలిచ్చింది.

’18ఏళ్లు పైబడ్డ వ్యక్తి మతం ఎంచుకోకూడదనడానికి కారణాలు లేవు. రాజ్యాంగంలో ప్రచారం అనే దానికి ఓ కారణం ఉంది’ అని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణన్ అన్నారు.

ఈ పిల్ లో అసలేం లేదని చెప్పడమే కాక .. పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటికేషన్ పై దీనిని పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. ఈ విషయం సీరియస్ అయితే భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా బీజేపీ లీడర్ ప్లీని విత్ డ్రా చేసుకోవాలని అన్నారు.

పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది. ‘కేంద్రం, రాష్ట్రాలు చేతబడి, అతీత శక్తులు, మత మార్పిడులు లాంటి వాటిని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ఆర్టికల్ 51ఏ ప్రకారం ఇది వారి డ్యూటీ. అని అశ్వనీ కుమార్ దూబె అన్నారు.