AAP తర్వాతి టార్గెట్ బెంగళూరే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగళూరులోనూ బలపడేందుకు ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశ రాజధానితో పాటు దక్షిణాదిలోనూ తమ హవా సాగించేందుకు వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఆగష్టులో జరగనున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ ఎన్నికలకు రెడీ అవుతుంది. 

ఇటీవల విడుదలైన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 63స్థానాలలో విజయం సాధించిన ఆప్.. బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థకు సంబంధించిన 198వార్డుల్లో అభ్యర్థులను నియమించనుంది. బెంగళూరు నగర వ్యాప్తంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఆప్ వాలంటీర్లు పాంప్లెట్లు పంచిపెడుతూ.. ఢిల్లీ స్టైల్‌లో ప్రచారం చేస్తున్నారు. 

బీబీఎంపీ ఎన్నికల్లో ఢిల్లీ స్థాయి విజయాన్ని ఆశిస్తుంది కర్నాటక ఆప్ యూనిట్. ‘బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాం. మేం చేసిన మంచి పనులకు ఢిల్లీ విజయం దక్కింది. అదే ఇలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టింది’ అని కర్ణాటకలోని ఆప్ కో కన్వీనర్ మీడియాకు తెలిపారు. 

ఇప్పటి వరకూ కర్ణాటకలో ఎటువంటి ఫలితాలు సాధించకపోయినా ఢిల్లీ విజయం తర్వాత అటువంటివి నమోదు చేయగలమనే విశ్వాసంగా ఉంది. ఢిల్లీలో ఆప్.. అద్భుతమైన మెజార్టీతో బీజేపీని ఓడించిన సంగతి తెలిసిందే. 

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్