Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి ఉద్యోగార్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. అగ్నిపథ్ పథకం కింద భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నాలుగు రోజుల క్రితం నియామకాల ప్రక్రియ ప్రారంభించింది.
- T Venkateshwarlu
- Published On : June 27, 2022 / 07:00 PM IST
Iaf
Agnipath: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి ఉద్యోగార్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. అగ్నిపథ్ పథకం కింద భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నాలుగు రోజుల క్రితం నియామకాల ప్రక్రియ ప్రారంభించింది. దీనికి అప్పుడే 94,281 దరఖాస్తులు వచ్చాయని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు ట్విటర్ ద్వారా తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి జూలై 5 వరకు గడువు ఉంది. కాగా, ఆదివారం వరకు 56,960 దరఖాస్తులు వచ్చాయి.
Maharashtra: పారిపోయిన వారు గెలవరు.. ప్రభుత్వం కుప్పకూలదు: ఆదిత్య ఠాక్రే
దేశంలో అగ్నిపథ్ పథకాన్ని జూన్ 14న ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం కింద కేవలం నాలుగేళ్ళు మాత్రమే విధుల్లోకి తీసుకోవడం ఏంటంటూ దేశ వ్యాప్తంగా ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్నివీర్ల కోసం పలు ప్రకటనలు చేశాయి. అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగం చేసి వచ్చిన వారికి రాష్ట్ర పోలీసు దళాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపాయి. అయితే, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డవారిని ఆర్మీలో తీసుకోబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
