Maharashtra: పారిపోయిన వారు గెల‌వ‌రు.. ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌దు: ఆదిత్య ఠాక్రే

 మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్న నేప‌థ్యంలో దీనిపై మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ''మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోదు. మేము గెలుస్తామన్న నమ్మకం మాకు ఉంది. అంద‌రి ప్రేమాభిమానాలు మాపై ఉన్నాయి. ద్రోహం చేసిన వారు, పారిపోయిన వారు గెల‌వ‌రు'' అని చెప్పారు. 

Maharashtra: పారిపోయిన వారు గెల‌వ‌రు.. ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌దు: ఆదిత్య ఠాక్రే

Aaditya Thackeray

Maharashtra: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్న నేప‌థ్యంలో దీనిపై మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ”మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోదు. మేము గెలుస్తామన్న నమ్మకం మాకు ఉంది. అంద‌రి ప్రేమాభిమానాలు మాపై ఉన్నాయి. ద్రోహం చేసిన వారు, పారిపోయిన వారు గెల‌వ‌రు” అని చెప్పారు.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు
”పారిపోయిన వారు తమను తాము తిరుగుబాటుదారులుగా చెప్పుకుంటున్నారు. వారు తిరుగుబాటుదారులుగా మారాల‌నుకుంటే, అదే పనిని ఇక్క‌డే ఉండి చేసి ఉంటే బాగుండేది. వారు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, మ‌ళ్లీ పోటీ చేయాల్సింది” అని ఆదిత్య ఠాక్రే అన్నారు.

presidential election: నామినేష‌న్ వేసిన య‌శ్వంత్ సిన్హా.. పోటీ రెండు భావ‌జాలాల‌క‌న్న రాహుల్

”మ‌హారాష్ట్ర మంత్రి ఉద‌య్ సామంత్ వెళ్లి ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలో చేరారు. ఇది ఉద‌య్ తీసుకున్న నిర్ణ‌యం. ఏదో ఒక‌రోజు తిరిగి మా వ‌ద్ద‌కు ఆయ‌న వ‌స్తారు.. నిజాయితీగా మాతో మాట్లాడ‌తారు” అని ఆదిత్య ఠాక్రే తెలిపారు. శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు న‌గ‌దు అక్రమ చ‌లామణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు పంపిన విషయంపై కూడా ఆదిత్య ఠాక్రే స్పందించారు. ”ఇవి రాజ‌కీయాల్లా లేవు. రాజకీయాలు ఇప్పుడు స‌ర్కస్‌లా మారాయి” అని వ్యాఖ్యానించారు.