presidential election: నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హా.. పోటీ రెండు భావజాలాలకన్న రాహుల్
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీఆర్‌ఎస్ సహా దేశంలోని అనేక విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

Yasheanth
presidential election: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీఆర్‌ఎస్ సహా దేశంలోని అనేక విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఉన్నారు.
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వస్తోన్న మద్దతుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”అన్ని విపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాకు ఐక్యంగా మద్దతు తెలిపాయి. నిజమైన పోరాటం రెండు భావజాలాల మధ్య ఉంటుంది. అందులో ఒక భావజాలం ఆర్ఎస్ఎస్‌ది. అది కోపం, ద్వేషంతో కూడుకుని ఉంటుంది. రెండోది దయతో కూడిన భావజాలం. ఇందుకోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిశాయి” అని రాహుల్ గాంధీ చెప్పారు. మరోవైపు, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమెతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఇతర నేతలు ఆ సమయంలో ఉన్నారు.