ఐదేళ్ల జీతాలు ఇవ్వకుండా సెలవిచ్చి సాగనంపేసిన ఎయిరిండియా

ఉద్యోగులను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో బోర్డ్ ఆఫ్ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ (సీఎండీ) పనికి దూరంగా ఉంటున్న ఉద్యోగులను సెలవుపై పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల పాటు జీతాలు ఇవ్వకుండానే సెలవులపై పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎంప్లాయీస్‌ను బోర్డు ప్రకారం.. ఈ కేటగిరీల ప్రకారం సెలవులు ఇచ్చేశారు. సూటబిలిటీ, ఎఫీషియన్సీ, కాంపిటెన్స్, క్వాలిటీ ఆఫ్ పర్‌ఫార్మెన్స్, ఉద్యోగి ఆరోగ్య స్థితి, ఉద్యోగి డ్యూటీకి అందుబాటులో ఉన్నారా లేదా’ అనే అంశాలు పరిగణనలోకి తీసుకుని విధుల నుంచి తప్పించే ఉద్యోగులను సెలక్ట్ చేసుకున్నారు.

ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ ఎంప్లాయీస్ ను జీతాలు లేకుండానే సెలవుపై ఆరు నెలలు లేదా రెండేళ్లు లేదా ఐదేళ్ల పాటు ఇంటికి పంపేయనున్నట్లు మంగళవారం అఫీషియల్ ఆర్డర్ ఇచ్చారు. హెడ్‌క్వార్టర్ లోని డిపార్ట్‌మెంటల్ హెడ్స్ ప్రతి ఉద్యోగికి యాక్సెస్ చేయడానికి రీజనల్ డైరక్టర్లు కావాలి. సీఎండీ అప్రూవల్ కోసం హెడ్ క్వార్టర్లో ఉన్న జనరల్ మేనేజర్ కు ఉద్యోగుల పేర్లు పంపాల్సి ఉంది’ అని అన్నారు.

కేంద్రం విమానశాఖకు ట్రావెలింగ్ నిబంధనలు విధించడంతో కొవిడ్ 19 సమయంలో భారీగా నష్టపోయింది. కోలుకునే క్రమంలో కాస్ట్ కటింగ్ తీసుకొచ్చిన ఎయిర్‌లైన్స్ చాలా మంది ఉద్యోగుల జీతాలకు కోత విధించింది. మే 25న ప్యాసింజర్ విమానాలకు అనుమతులు ఇచ్చినా.. రెండు నెలల కరోనా వైరస్ లాక్ డౌన్ నష్టాన్ని పూడ్చలేకపోతున్నారు. అంతర్జాతీయ విమానాలకు మార్చి 23నుంచి బ్రేక్ వేసిన కేంద్రం జులై 31వరకూ కొనసాగించేలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు